వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడతాం | - | Sakshi
Sakshi News home page

వృథాగా పోతున్న నీటిని ఒడిసిపడతాం

Oct 29 2026 12:18 AM | Updated on Oct 29 2026 12:18 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రుద్రంగి/కోనరావుపేట : అడవుల్లో సహజసిద్ధంగా ప్రవహిస్తూ వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి వన్యప్రాణులతోపాటు సమీప గ్రామాల ప్రజలకు నీటి భద్రత కల్పించేలా చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లోని సహజ నీటి వనరులను సంరక్షించడం, చెక్‌డ్యామ్స్‌, కుంటలు, చిన్న చెరువులను పునరుద్ధరించడం ద్వారా నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రుద్రంగి మండల పరిధిలోని సీమర్లు, రెండు గట్ల వాగు, సూరమ్మ బుగ్గ కుంట, బుగ్గరాజు రాజేశ్వర చెక్‌డ్యామ్‌ను బుధవారం పరిశీలించారు. మరిమడ్ల అటవీ ప్రాంతంలోని జలవాగు, కొండెం చెరువు, ఊర చెరువు తదితర ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసే అవకాశాలను పరిశీలించారు. మరిమడ్ల–మానాల మధ్య దెబ్బతిన్న చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. డీఎఫ్‌వో సత్యనారాయణ, ఎఫ్‌ఆర్వో మాధవి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement