● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలపై పోలీస్, ఎకై ్సజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలన్నారు. షాపుల్లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేయాలని సూచించారు. మత్తుకు బానిసైన వారిని గుర్తించి చికిత్స, కౌన్సిలింగ్ అందించాలన్నారు. అటవీ భూముల్లో గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు.
విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు
వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్‌శాఖల ఆధ్వర్యంలో డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీ వోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, డీఈవో విజయ్‌సాగర్, ఇంటర్ విద్యాధికారి శరత్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్, జిల్లా ఎకై ్సజ్ అధికారి హిమశ్రీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు.


