ఉపకార ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉపకార ఉద్యమం

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● పుష్కర రోజులుగా ఆందోళన ● సమ్మెలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

సిరిసిల్ల అర్బన్‌: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు పుష్కర రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యబీమా, హెల్త్‌కార్డులు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పీఆర్సీ అమలు, ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ లాంటి డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 60 సబ్‌సెంటర్లలో 280 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇన్ని రోజులుగా సేవలందించిన ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సి రావడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్య సేవలకు వెన్నుముక

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజా ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర కీలకం. గర్బిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలందించడంలో నిరంతరం శ్రమిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీరు సమ్మెలో ఉండడంతో వైద్యసేవలపై ప్రభావం పడుతుంది.

రేపు డెలివరీ అన్న పనిచేసిన

నేను విలాసాగర్‌ పీహెచ్‌సీ పరిధి లోని వెంకట్రావుపల్లె సబ్‌సెంటర్‌లో పనిచేస్తున్నాను. 2023లో డెలి వరీ సమయంలో సెలవులు ఇవ్వకపోవడంతో రేపు డెలివరీ అని తెలిసి కూడా పనిచేసిన. డెలివరీ అయిన తర్వాత కూడా ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో విధులు నిర్వహించాను. సమాన పనికి సమాన వేతనంతోపాటు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.

– శిరీష, ఎంఎల్‌హెచ్‌పీ, పీహెచ్‌సీ విలాసాగర్‌

ఉద్యోగ భద్రత కల్పించాలి

మాది కామారెడ్డి జిల్లా. నేను వీర్నపల్లి ఆరోగ్య కేంద్రంలో సంవత్సరంన్నర నుంచి ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్నాను. సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మా సెంటర్‌లో 5 గ్రామాలకు 6 వేల జనాభా ఉంది. వారందరికి వైద్యసేవలు అందిస్తున్నాం. మాకు ప్రధానంగా ఉద్యోగ భద్రత కల్పించాలి.

– బాలకృష్ణ, ఎంఎల్‌హెచ్‌పీ, వీర్నపల్లి

15 ఏళ్లుగా పనిచేస్తున్న

నేను గత 15 ఏళ్లుగా ఆయుష్‌లో పనిచేస్తున్నాను. నా ప్రారంభ వేతనం రూ.3,900. గత 15 ఏళ్లుగా ఇదే జీతంపై పనిచేస్తున్నాను. 2014లో పెంచారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. దీంతో పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ఇబ్బంది అవుతుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

– శారద, ఇల్లంతకుంట సబ్‌సెంటర్‌

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

నేను హన్మాజీపేట పీహెచ్‌సీలో సెకండ్‌ ఏఎన్‌ఎంగా 18 ఏళ్లుగా పనిచేస్తున్నాను. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. చాలీచాలని వేతనంతో కుటుంబసోషణ ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

– సరస్వతి, హన్మాజిపేట పీహెచ్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement