పొన్న రథంపై గోవిందుడు | - | Sakshi
Sakshi News home page

పొన్న రథంపై గోవిందుడు

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● తిరువీధుల్లో తిలకించిన అశేష భక్తజనం ● మిన్నంటిన గోవింద నామస్మరణం ● శ్రీవారి వాహనసేవల్లో అతిముఖ్య ఘట్టం ● అలరించిన జానపదాల ఆటలు.. భక్తిపాటలు

కోలాటం ఆడుతున్న మహిళలు

రంగనాయక తిరుప్పోల సేవపై శ్రీవారి విహారం

సిరిసిల్లటౌన్‌: తొమ్మిది రోజులుగా సాగుతున్న శ్రీశాల శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి అతిముఖ్యమైన ఘట్టం పొన్న రథోత్సవం జరిగింది. చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన అశేష భక్తుల గోవింద నామస్మరణల మధ్య పొన్న రథ యాత్ర కొనసాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల కోలాటాలు, భజన సంకీర్తనలు గావించారు. దేవదేవుడికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం జరుగనున్న రథయాత్రకు ఒకరోజు ముందే పొన్నరథ యాత్రతో జాతర శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్‌, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్‌, అర్చకస్వాములు కృష్ణమాచారి, నవీన్‌చారి, సుకుమారచారి, వర్దనాచారి తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వం.. ‘రంగనాయకుల తిరుప్పోలం’

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రంగనాయక తిరుప్పోలంపై శ్రీవారు శ్రీదేవి, భూదేవిల సహితంగా విహరించారు. ఈదివ్య సేవను భక్తులు దర్శనం చేసుకుని పునీతులయ్యారు.

పొన్న వాహన సేవకు తరలొచ్చిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement