కాలుష్య కాసారం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య కాసారం

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● చెరువుల్లో చికెన్‌ వ్యర్థాలు ● కంపుకొడుతున్న నీటి కుంటలు ● విజృంభిస్తున్న వైరస్‌లు

● చెరువుల్లో చికెన్‌ వ్యర్థాలు ● కంపుకొడుతున్న నీటి కుంటలు ● విజృంభిస్తున్న వైరస్‌లు

ఎల్లారెడ్డిపేట: తాగునీటి చెరువులు కలుషితమవుతున్నాయి. గ్రామ శివారులు కంపుకొడుతున్నాయి. సాయంత్రం వేళ కనీసం వాకింగ్‌కు వెళ్లే పరిస్థితులు కూడా కరువవుతున్నాయి. చెరువు కట్టకు వెళ్లి కాసేపు ఆహ్లాదంగా గడుపుదామన్న పరిస్థితులు లేవు. ఏ ఊరి చెరువు చూసినా చికెన్‌ వ్యర్థాలతో అధ్వానంగా మారుతున్నాయి. చెరువుల కలుషితంపై ‘సాక్షి’ ఫోకస్‌.

నీటి వనరులు కలుషితం

జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు కలుషితమవుతున్నాయి. చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా నీటి వనరుల్లో పడేస్తున్నారు. ఫలితంగా నీటి వనరులు కలుషితమవుతున్నాయి. చెరువుల ద్వారా వచ్చే నీరు వ్యవసాయ కాలువల ద్వారా బావుల్లోకి చేరుతున్నాయి. అలా చేరిన నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు సైతం కలుషితమవుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్దెచెరువు, నారాయణపూర్‌ శివారులోని పెద్దమ్మ ఒర్రె, సిరిసిల్ల శివారులోని కార్గిల్‌లేక్‌ పరిసరాలు, వేములవాడ–నాంపల్లి మధ్య పరిసరాలు, గంభీరావుపేట నుంచి దమ్మన్నపేట వెళ్లే మార్గంలోని చెరువు, ముస్తాబాద్‌ నుంచి సిద్దిపేట రూట్‌లో పెద్దచెరువు కట్ట కింది ప్రాంతం, తంగళ్లపల్లి సమీపంలోని మానేరువాగు పరిసరాల్లో చికెన్‌ వ్యర్థాలు పడేస్తున్నారు.

వ్యాధుల వ్యాప్తి

భూగర్భజలాలు కలుషితం కావడంతో గ్రామాల్లో చర్మ వ్యాధులు వస్తున్నాయి. అంతేకాకుండా గ్రామ శివారులో చికెన్‌ వ్యర్థాలు పడేయడంతో అవి కుళ్లిపోయి దోమలు పెరిగి గ్రామ శివారులోని కాలనీవాసులు ఇబ్బందిపడుతున్నారు. సాయంత్రం అయిందంటే శివారులో నివసించే వారు దోమల బాధతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉంటున్నారు.

రోగాలు వస్తాయి

చెరువుల్లో చికెన్‌ వ్యర్థాలు పడేస్తే వివిధ రకాల వైరస్‌లు నీటిలో కలుస్తాయి. చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చికెన్‌ వ్యర్థాలు పశువులు తింటే వాటికి రేబిస్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యర్థాలను చెరువుల్లో పడేయొద్దు.

– అలిగిరెడ్డి, అమరేందర్‌రెడ్డి, వైద్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement