టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Oct 26 2026 12:04 AM | Updated on Oct 26 2026 12:04 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● 80 ఫీట్ల రోడ్డు పనులు పరిశీలన

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ● 80 ఫీట్ల రోడ్డు పనులు పరిశీలన

వేములవాడ: కాంగ్రెస్‌ ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని, వేములవాడను ఆధ్యాత్మిక, టెంపుల్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు జరుగుతున్న 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు. ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయన్నారు. ఆలయ అభివృద్ధి పనులు 55శాతం, అన్నదాన సత్రం పనులు 50శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. అదనంగా రూ.99.40 కోట్ల నిధులు మంజూరు చేయడంతో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మూడో బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేశామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

పేదల వైద్యానికి ప్రభుత్వం భరోసా

ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో మాతృశ్రీ, అశ్విని, వర్ష ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు అందుతున్నాయని, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా కూడా అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement