సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రం.. ఒకప్పుడు స్వచ్ఛ సిరిసిల్లగా జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది. ఇప్పుడేమైందో కానీ.. ఒక్కసారిగా నిలు వెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రభుత్వం చెబుతుంటే.. పగలే వెన్నెలా అన్నట్లుగా పొద్దంతా వీధిదీపాలు వెలుగుతున్నాయి. 29వ వార్డులో పొద్దంతా వెలుగుతున్న వీధిలైట్లు ఇందుకు తాజా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే యంత్రాంగం ఉన్నా రోడ్డు పక్కన చెత్తను పోస్తున్నారు. అలా పోసిన చెత్తను తొలగించడంలోనూ మున్సిపల్ పారిశుధ్య విభాగం విఫలమవుతుంది. 29వ వార్డులో కనిపిస్తున్న ఈ చెత్త కుప్పలే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. మున్సిపల్ పాలకవర్గ పట్టింపులేని తనం, సిబ్బంది నిర్లక్ష్యం.. ఫలితంగా స్వచ్ఛ సిరిసిల్లకు మచ్చ వస్తుంది. ఇప్పుటికై నా మున్సిపల్ అధికారులు శ్రద్ధచూపి నిర్లక్ష్యాన్ని వీడితే ప్రజాధనాన్ని రక్షిస్తూ.. ప్రజారోగ్యాన్ని కొంతైనా కాపాడినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


