సిరిసిల్లటౌన్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సిరిసిల్ల రామ్‌లీలా మైదానంలో నిర్వహించే రావణ దహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెర్గు సత్యనారాయణ కోరారు. సోమవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక బతుకమ్మ ఘాటు వద్ద రావణాసుర వధ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూ ఉత్సవ సమితి ప్రచార కార్యదర్శి గాజుల వేణు, సహాయ కార్యదర్శి బైరగోని వెంకన్నగౌడ్, గౌరవ అధ్యక్షుడు ఆడెపు రవీందర్, ఉపాధ్యక్షులు మండల సత్యం, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాహితీ మహోత్సవానికి ఆహ్వానం
ఇల్లంతకుంట: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో కళావేదిక నిర్వహించే 8వ ప్రపంచ సాహితీ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ మండలంలోని ముస్కానిపేటకు చెందిన తునికి తిరుపతికి ఆహ్వానం అందింది. నవంబర్ 1 నుంచి సాహితీ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని ధవలేశ్వరం గౌతమి సదన్ ఆడిటోరియంలో జరగనున్నాయి. తిరుపతి స్థానిక ప్రైవేట్‌స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.


