ముస్తాబాద్: మండలంలోని తెర్లుమద్దిలో మొబైల్‌ఫోన్ల సేవలు అందడం లేదని వినియోగదారులు సోమవారం రాత్రి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఓ కంపెనీకి చెందిన మొబైల్‌ఫోన్ల కనెక్షన్లు ఊరంతా తీసుకున్నామన్నారు. ఏడాదిగా నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై న అంతరాయం లేకుండా సేవలు అందించాలని కోరారు.
ఎకై ్సజ్ దాడులు.. గోవా మద్యం పట్టివేత
గంభీరావుపేట : మండలంలోని లక్ష్మీపూర్, గోరింటాల, లింగన్నపేట, సముద్రలింగాపూర్, గజసింగవరం గ్రామాల్లో సోమవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గోరింటాలలో కుమ్మరవేని నాగరాజు వద్ద అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 15 గోవా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ విజేందర్ తెలిపారు. దాడుల్లో అధికారులు మోహిజ్, సిద్దిరాములు, కరుణాకర్, కృషిధర్, వర్ష తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్ల అర్బన్: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు సోమవారం బైక్ ర్యాలీ తీసి నిరసన తెలిపారు. పలువురు మాట్లాడుతూ వేతనాల పెంపు, వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రసూతి సెలవులు, ఆరోగ్య ప్రమాద బీమా, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలని కోరారు.


