నేను జగిత్యాల జిల్లా బీర్పూర్‌లో పోలీసు అమర వీరుల స్తూపాన్ని 2005లో కట్టించాను. అది పీపుల్స్‌వార్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి సొంతూరు. సిరిసిల్ల డీఎస్పీగా పనిచేసినప్పుడు కట్టలింగంపేటలోనూ స్తూపాన్ని కట్టించాను. ఇలాంటి కొన్ని పనులు జీవితంలో మరిచిపోనివిగా నిలిచిపోతాయి. ఎక్కడ పనిచేసినా ప్రజలతో మమేకమైనా. – దామెర నర్సయ్య, రిటైర్డ్ డీఎస్పీ
వారోత్సవాలు నిర్వహిస్తాం
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసు వీరులను స్మరించుకుంటూ జిల్లాలో వారోత్సవాలు నిర్వహిస్తాం. పోలీస్ ఓపెన్‌హౌస్, విద్యార్థులకు, యువకులు, పోలీసులకు వేర్వేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాం. పోలీసు అమరుల కుటుంబాలను కలిసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజారక్షణలో ప్రాణాలను పణంగా పెట్టడం కంటే గొప్ప త్యాగం మరొకటి ఉండదు. అక్టోబరు 21 నుంచి నెలాఖరు వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తాం. నిస్వార్థ సేవకు పోలీసు అమరవీరులే నిదర్శనం. – మహేశ్ బీ గీతే, ఎస్పీ


