అన్నదాత చి‘వరి’ ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

అన్నదాత చి‘వరి’ ప్రయత్నం

Oct 19 2026 11:56 PM | Updated on Oct 19 2026 11:56 PM

సిరిసిల్ల: ఆరుగాలం శ్రమించిన అన్నదాత నోటికాడికొచ్చిన పంటను కాపాడుకునేందుకు చి‘వరి’ ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు తడులు పెడితే.. పది రోజుల్లో పంట చేతికందే దశలో బోరు ఎత్తిపోయింది. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు. కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన రైతు బైరగోని బాలాగౌడ్‌ స్థానికంగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. పంట పది రోజులైతే కోతకు వచ్చేలా ఉండగా బోరు ఎత్తిపోయింది. రెండు తడులు ఇస్తే పంట చేతికి అందుతుంది. వంద మీటర్ల దూరంలో ఓ రైతు వ్యవసాయ బావి నుంచి నీటిని వాడుకునేందుకు యజమానితో మాట్లాడుకున్నాడు. అయితే అడ్డంగా రోడ్డు ఉండడంతో పైపులు కొని, వేములవాడ–సిరికొండ ప్రధాన రోడ్డు పై నుంచి వాటిని వేసి పొలాన్ని పారిస్తున్నాడు. పైపుతోనే మడికి తడి పెడుతున్నాడు. తడారిన పొలాన్ని దక్కించుకునేందుకు ఆ అన్నదాత పడుతున్న యాతన నేటి రైతుల పరిస్థితికి అద్దం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement