అమరులకు సెల్యూట్‌ | - | Sakshi
Sakshi News home page

అమరులకు సెల్యూట్‌

Oct 19 2026 11:56 PM | Updated on Oct 19 2026 11:56 PM

● ప్రజారక్షణలో పోలీసులు ● విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పలువురు ● 21 పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం ● చందుర్తి మండలం కట్టలింగంపేటలో కార్యక్రమం ● 1991లో ఎల్లారెడ్డిపేట గాంధీ విగ్రహం వద్ద శ్రీనివాసరావు అనే హోంగార్డును అప్పటి పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు చంపేశారు. ● 1992లో ఎస్‌ఐ సాబీర్‌ఖాన్‌ కోనరావుపేట ఎస్సైగా పనిచేస్తుండగా పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కాల్పులు జరిపారు. కోనరావుపేట మండలం మర్తనపేట–ధర్మారం శివారులో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న సాబీర్‌ఖాన్‌పై నక్సలైట్లు కాల్పులు జరిపారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన మోటార్‌ సైకిల్‌ను నక్సలైట్లు దహనం చేశారు. ● 1993లో గంభీరావుపేట ఎస్సైగా పనిచేస్తున్న అదే సాబీర్‌ఖాన్‌ను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. ● ఆ తరువాత అదే ప్రాంతంలో ఆరు నెలల్లోపే పీపుల్స్‌వార్‌ నక్సలైట్‌ మోహన్‌ ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. ● 1996లో కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో టెలీఫోన్‌ ఎక్స్ఛేంజీని మావోయిస్టు నక్సలైట్లు పేల్చారు. ఈ కేసు దర్యాప్తునకు పోలీసులు వస్తారని నిజామాబాద్‌–కోనరావుపేట మధ్య మావోయిస్టులు మాటు వేశారు. ద్విచక్రవాహనాలపై పోలీసుల రాకను గమనించి కల్వర్టును నక్సలైట్లు మందుపాతరలతో పేల్చారు. ఈ ఘటనలో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న కానిస్టేబుళ్లు నజీర్‌, మోహన్‌యాదవ్‌ చనిపోయారు. అప్పటి కోనరావుపేట ఎస్సై రవీందర్‌రెడ్డి, ఏఎస్సై నాయుడులు త్రుటిలో తప్పించుకున్నారు. ● 1997లో కోనరావుపేట మండలం వట్టిమల్ల వ ద్ద చంద్రశేఖర్‌ అనే హోంగార్డును మావోయిస్టులు కాల్చి చంపి, బైక్‌పై శవాన్ని తెచ్చి పడేశారు. ● 1998లో కూంబింగ్‌కు వెళ్లిన అప్పటి కోనరావుపేట ఎస్సై ముసిపట్ల శ్రీనివాస్‌గౌడ్‌ను మావోయిస్టు నక్సలైట్లు ఎగ్లాస్‌పూర్‌ గుట్టల్లో కాల్చి చంపారు. ● 1999లో చందుర్తి మండలం కట్టలింగంపేట–రుద్రంగి మధ్య పోలీసుల జీపును పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మందుపాతరతో పేల్చివేయగా.. అప్పటి చందుర్తి ఎస్సై శ్రీనివాసరావు అసువులు బాశారు. ● 2000లో కోనరావుపేట మండలం వట్టిమల్ల గిరిజన తండాలో జనశక్తి నక్సలైట్ల చేతిలో కానిస్టేబుళ్లు హెంకూనాయక్‌, కృష్ణ బలయ్యారు.

● ప్రజారక్షణలో పోలీసులు ● విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పలువురు ● 21 పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినం ● చందుర్తి మండలం కట్టలింగంపేటలో కార్యక్రమం

సిరిసిల్ల: ప్రజారక్షణలో ప్రాణాలను సైతం అడ్డుగా పెట్టి పోరాడే యోధులు పోలీసులు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడేందుకు కంటిమీద కునుకు లేకుండా శ్రమించే పోలీసుల త్యాగాలు నిరుపమానం. విధినిర్వహణలో అసువులు బాసిన అమర పోలీసులను స్మరిస్తూ ఏటా అక్టోబరు 21న పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా గతంలో కల్లోల ఖిల్లా హింసాత్మక ఘటనలకు వేదికై ంది. 35 ఏళ్ల క్రితం పోలీస్‌ ఉద్యోగం వచ్చినా నక్సలైట్ల భయంతో ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఎందరో యువకులు వదులుకునే పరిస్థితులు ఉండేవి. జిల్లాలో పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రత్యేక కథనం.

అసువులు బాసిన అమర పోలీసులు

జిల్లాలో అమర పోలీసుల జాడలు విషాదగీతికలయ్యాయి. కల్లోలిత ప్రాంతంగా సిరిసిల్ల నక్సల్స్‌ ఉ ద్యమాలతో అట్టుడికిపోయింది. మావోయిస్టులు, జనశక్తి నక్సలైట్లు, సమాజ రక్షణకు పోలీసులు.. ఇలా మూడు తుపాకుల మధ్య జిల్లా జనజీవనం మూడు దశాబ్దాలపాటు ఉత్కంఠ పరిస్థితుల్లో కొనసాగింది.

కట్టలింగంపేటలో అమరవీరుల స్తూపం

చందుర్తి మండలం కట్టలింగంపేట వద్ద పోలీసు అమరవీరుల స్తూపాన్ని 2014లో అప్పటి సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య ఆధ్వర్యంలో నిర్మించారు. విధి నిర్వహణలో అసువులుబాసిన చందుర్తి ఎస్సై శ్రీనివాస్‌రావు మందుపాతరకు బలైన ప్రదేశంలోనే స్తూపం కట్టారు. ఇక్కడే ఏటా అక్టోబరు 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు అమరవీరుల దినోత్సవం నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement