చందుర్తి: ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన చెక్కును బాధిత కుటుంబానికి సోమవారం అందజేసినట్లు చందుర్తి కేడీసీసీబీ మేనేజర్ అజయ్ తెలిపారు. మండలంలోని ఎన్గల్‌కు చెందిన చేపూరి జ్యోతి ఆగస్టు 6న మృతిచెందింది. జ్యోతి భర్త రాజుకు ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన కింద మంజూరైనా రూ.2లక్షల బీమా చెక్కును సోమవారం అందజేశారు. మేనేజర్ అజయ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనలో తక్కువ ఖర్చుతో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉందని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


