నక్సలైట్‌గా పట్టుబడినా.. | - | Sakshi
Sakshi News home page

నక్సలైట్‌గా పట్టుబడినా..

Oct 19 2026 11:56 PM | Updated on Oct 19 2026 11:56 PM

నక్సలైట్‌గా పట్టుబడినా..

మాది వీర్నపల్లి మండలం గర్జనపల్లి. నేను 1997లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన. ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీలో పనిచేసిన. 1999లో అప్పటి పీపుల్స్‌వార్‌ పశ్చిమ డివిజన్‌ జిల్లా కార్యదర్శి పద్మక్క, దళనేత కొమ్ము బాబ న్న, ప్రవీణ్‌, సాగర్‌ మరో 16 మంది సాయుధులం కోనరావుపేట మండలం వట్టిమల్ల శివారు అడవుల్లోకి చేరుకున్నాం. అప్పటికే వట్టిమల్ల శివారుల్లో పోలీసులు మాటు వేసి ఉన్నారు. ఇరువైపులా నుంచి కాల్పులు మొదలయ్యాయి. గంటపాటు అంటే రాత్రి 10.30 గంటల వరకు కాల్పులు సాగుతూనే ఉన్నాయి. నేను కిట్‌ బ్యాగుతో అడవిలోకి పారిపోయిన. అలివ్‌గ్రీన్‌ డ్రెస్సును మార్చుకుని, చీరకట్టుకున్న. తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు నన్ను అడవుల్లో చుట్టుముట్టారు. అప్పటికే నా వద్ద ఆయుధం, కిట్‌బ్యాగు లేవు. ప్రాణం పోయినంత పని అయింది. మాది బావుసాయిపేట.. నేను తునికాకు సేకరణ కోసం అడవిలోకి వచ్చిన అని అబద్ధం చెప్పిన. ఊరి శివారులో కాల్పులు జరిగిన ప్రదేశానికి నన్ను పోలీసులు పట్టుకురాగా.. అక్కడే ఉన్న ప్రజలు గుర్తుపట్టారు. నేను దళసభ్యురాలినని పోలీసులు ఆలస్యంగా గుర్తించడంతో చంపకుండా, అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ ఉద్యమంలోకి వెళ్లి.. ఎనిమిదేళ్ల పాటు పనిచేసిన. మద్దిమల్ల, ఆదిలాబాద్‌ జిల్లా లక్ష్మీపూర్‌, మానాల ఎదురుకాల్పల నుంచి తప్పించుకున్న. 2005లో ఎస్పీ ఎదుట సరెండర్‌ అయిన. పోలీసులు మానవత్వంతో నా ప్రాణాలు కాపాడి హోంగార్డుగా ఉద్యోగమిచ్చారు.

– గుంటుక అనసూర్య, హోంగార్డు,

మాజీ నక్సలైట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement