సీఎం బహిరంగ సభకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. కాలేజీ మైదానం నుంచి బహిరంగ సభ వేదిక వరకు ముందుస్తుగా రోడ్డు వైపు ఉన్న దుకాణదారులకు నోటీసులు జారీ చేసి బంద్ చేయించారు. కాలేజీ మైదానం చుట్టూరా ఉన్న ఇళ్లలో ముందుస్తు తనిఖీలు చేసి సాయుధ పోలీసు రక్షణ కల్పించారు. సీఎం పాదయాత్ర సందర్భంగా రోప్‌పార్టీ ఏర్పాటు చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే రెండు రో జులుగా జ్వరంతో బాధపడుతున్నా జ్వరంతోనూ బందోబస్తు విధులు నిర్వహించారు. సీఎం పర్యటనకు 1600 మంది పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేశారు. మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ కమలాసన్‌రెడ్డి, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర భద్రత విధుల్లో పాల్గొన్నారు.


