సెల్‌టవర్‌ పనులు అడ్డుకున్న గ్రామస్తులు | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ పనులు అడ్డుకున్న గ్రామస్తులు

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

● ఎన్‌ఐఆర్డీ పంచాయతీరాజ్‌ కన్సల్టెంట్‌ ఆశాలత ● బీఆర్‌ఎస్‌ నాయకులు

రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో నిర్మిస్తున్న సెల్‌ టవర్‌ పనులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటికే నివాసాల మధ్య ఉన్న రెండు టవర్లతోని వచ్చే రేడియేషన్‌తో రోగాల బారిన పడుతున్నామని.. ఇప్పుడు నిర్మించే టవర్‌తో మరింత రేడియేషన్‌ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని, పనులు ఆపబోమని సెల్‌టవర్‌ సిబ్బంది చెప్పడంతో గ్రామస్తులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో కాకుండా దూరంగా టవర్‌ నిర్మించాలని కోరారు.

ఆదర్శ గ్రామంగా గూడూరు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మహిళా ప్రజాప్రతినిధుల ద్వారా జరుగుతున్న అభివృద్ధిపై జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ ప్రతినిధి ఆశాలత క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఈమేరకు ముస్తాబాద్‌ మండలం గూడూరును బుధవారం సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను చిత్రపటం ద్వారా తెలుసుకున్నారు. ఆశాలత మాట్లాడుతూ గత జనవరిలో హైదారాబాద్‌లోని శిక్షణలో నేర్చుకున్న అంశాలను గూడూరు సర్పంచ్‌ చీటి సునీత క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారన్నారు. నీరు, భూమి, గాలి రక్షణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కొనియాడారు. పంటల సాగు, స్వయం ఉపాధికి చేస్తున్న పనులు బాగున్నాయన్నారు. సర్పంచ్‌ చీటి సునీత, ఉపసర్పంచ్‌ ప్రభాకర్‌, పంచాయతీ కార్యదర్శి కుమారి, మాజీ సర్పంచ్‌ వెంకటనర్సింగరావు, ఏపీవో ఆనంద్‌, దిలీప్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య హౌస్‌ అరెస్ట్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్యను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చే శారు. బుధవారం తెల్లవారుజామున ఆగయ్య ఇంటికి చేరుకున్న పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆగయ్య మా ట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను నిలదీయకుండా తమ అరెస్టులతో ప్ర జల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్‌ అరెస్టులు, ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు.

ప్రశ్నిస్తే అరెస్టులా ?

సిరిసిల్ల అర్బన్‌: ప్రభుత్వ విధానాలు, ప్రజాసమస్యలపై ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులను అరెస్టు చేసి ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట ప్రాంతాలకు తరలించారు. సిరిసిల్ల బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, దిడ్డి రాజు, గెట్యాల శ్రీనివాస్‌, సాయికృష్ణ, నెల్లుట్ల నరేశ్‌, లవన్‌, కంచర్ల రవిగౌడ్‌, కోడి అంతయ్య, మ్యాన రవిలను పోలీసులు ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement