పాదయాత్ర చేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పాదయాత్ర చేస్తూ..

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

సిరిసిల్ల: సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ.. పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. సిరిసిల్ల వీధుల్లో 30 నిమిషాలపాటు మూడు కిలోమీటర్లు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం పాదయాత్ర చేస్తూ.. దారి వెంట ఉన్న యువకులను, మహిళలను, నేతన్నలకు అభివాదం చేస్తూ.. నవ్వుతూ.. ఉత్సాహం నింపారు. సీఎం పాదయాత్ర చేయడం పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. బాణాసాంచాల పేలుళ్లు.. పార్టీ పాటలు, కళాకారుల ఆటలతో పాదయాత్ర సాగింది. సీఎం ప్రసంగంలోనూ సిరిసిల్లలో మూడురంగుల జెండా ఎగురాలని, మంత్రి చాన్స్‌ వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు పద్మశాలీ బిడ్డను ఎమ్మెల్సీని చే స్తామని ప్రకటించారు. ఎవరా అభ్యర్థి.. అనే చర్చ మొదలైంది. 5 గంటల వరకు సభా ప్రాంగణం భారీ జనంతో నిండిపోయింది. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు

సిరిసిల్ల, వేములవాడల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించి, శంకుస్థాపన చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో ఆఫీస్‌లకు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌, రుద్రంగి తహసీల్దార్‌ ఆఫీ స్‌లకు, వేములవాడ సబ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు, రుద్రంగిలో 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో నిర్మించే గోదాముకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య భవవాన్ని ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారా యణగౌడ్‌, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

నేరెళ్ల బాధితులకు ఆర్థిక సాయం

నేరెళ్ల బాధితులకు కొందరికి రూ.10 లక్షల చొప్పున, రూ.5 లక్షల చొప్పున మరికొందరికి ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement