ఇరుకు గదులు.. అరకొర వసతులు | - | Sakshi
Sakshi News home page

ఇరుకు గదులు.. అరకొర వసతులు

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

● అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ● అసౌకర్యాల మధ్యనే విధులు ● ఇబ్బంది పడుతున్న అధికారులు, ప్రజలు

మూడే గదులు.. 16 మంది

బోయినపల్లి.. నాలుగే గదులు

వీర్నపల్లి(సిరిసిల్ల) : మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి పక్కా భవనం లేదు. మూడే గదులు ఉన్న తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ అధికారులతో కలుపుకొని 16 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్న గదిలో తహసీల్దార్‌ ఉంటుండగా, డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐలు, జూనియర్‌ అసిస్టెంట్లు, జీపీవోలు, ధరణి ఆపరేటర్లు మిగిలిన రెండు గదుల్లో సర్దుకుంటున్నారు. కార్యాలయంలోని భూ రికార్డులు, పట్టా పాసుపుస్తకాలు, ఇతర విలువైన పత్రాలకు భద్రత కరువైంది. వర్షాకాలంలో తేమ వచ్చి రికార్డులు పాడయ్యే ప్రమాదం ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనులపై ఆఫీస్‌కు వచ్చే వారు ఆరుబయటనే ఎదురుచూస్తున్నారు.

బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి తహసీల్దార్‌ ఆఫీస్‌ భవనం ఇరుకుగా ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. వివిధ ధ్రువీకరణపత్రాలు, రెవెన్యూ పనులపై కార్యాలయానికి వచ్చే వారు తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్లు సైతం ఇక్కడే చేస్తుండడంతో రద్దీగా మారుతుంది. తహసీల్దార్‌, డీటీ, ఆర్‌ఐలతో కలిసి ఆఫీస్‌ సిబ్బంది పది మంది వరకు, జీపీవోలు మరో పది మంది ఉన్నారు. వివిధ పనుల మీద రోజుకు 20 నుంచి 30 మంది వస్తుంటారు. ఆఫీస్‌లో నాలుగే గదులు ఉన్నాయి. 2012లో రూ.17.25 లక్షలతో నిర్మించారు. నాలుగు గదులు, ఒక వరండా మాత్రమే ఉంది. ఒకటి తహసీల్దార్‌ గది, మరో గదిలో డిప్యూటీ తహసీల్దార్‌ ఇతర ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో గది భూ భారతి ఆపరేటర్‌, ఇంకో గది రికార్డు రూం. చిన్న వరండాలో రిజిష్ట్రేషన్‌కు వచ్చిన వారు, తహసీల్దార్‌ను కలిసేందకు వచ్చిన వారు వేచి ఉంటారు.

ఆర్‌ఐ, జీపీవోలకు రేకుల గది

తహసీల్దార్‌ కార్యాలయంపైన గతంలో రేకులగదిని ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్‌ఐతోపాటు పది మంది జీపీవోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షం కురిస్తే ఈ గది ఉరుస్తుంది.

అద్దె భవనం.. శిథిలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement