పోలీస్‌ యాక్ట్‌ అమలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ యాక్ట్‌ అమలు

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే గురువారం తెలిపారు. పోలీస్‌ యాక్ట్‌ –1861 ప్రకారం నెల రోజుల(అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు)పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్‌ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్స్‌, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించారాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం, భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement