కుంటలు కబ్జా ! | - | Sakshi
Sakshi News home page

కుంటలు కబ్జా !

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

– 8లోu ● బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో గోగులగుట్ట పరిసరాల్లో ఐదెకరాల సర్కారు భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో హద్దులు ఏర్పాటు చేసినప్పటికీ భూమిని స్వాధీనం చేసుకోలేదు. ● బోయినపల్లి మండలం స్తంభంపల్లి చెరువు స్థలం చుట్టూ గతంలో హద్దులు ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం ఆ గుర్తులు కనిపించడం లేదు. ● బోయినపల్లిలో చెరువు కుంట శిఖం భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నారనే ఆరోపణలు ఉ న్నాయి. ఇక్కడ ప్రభుత్వ భూముల హద్దురాళ్లు దాటి పలువురు పంటలు సాగుచేస్తున్నారు. ● నర్సింగాపూర్‌ ప్రభుత్వ భూమి, పరంపోగుతోపాటు చెరువు స్థలం ఆక్రమణలకు గురైనా పట్టించుకునే వారు లేరు. గతంలో ధ్వంసమైన కుంట కట్టను ఇప్పటికీ మరమ్మతు చేయించలేదు. ● విలాసాగర్‌ పెద్ద చెరువు విస్తీర్ణం 198 ఎకరాల్లో ఉంది. చెరువు కింద 688 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. కాగా చెరువు శిఖం పరిసరాల్లో భూములు ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ● అనంతపల్లిలో కుంట వద్ద భూమిని పట్టా భూమిలో కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్తంభంపల్లిలో గంజివాగు కాలువ భూములు, రామన్నపేటలో బూరుగుకుంట, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం సమీపంలో సైతం ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. వరదకాలువల పరిసరాల్లో ప్రభత్వం సేకరించిన భూములు సైతం ఆక్రమిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

న్యూస్‌రీల్‌

పట్టించుకోని ఇరిగేషన్‌ శాఖ

రెచ్చిపోతున్న కబ్జాదారులు

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
చెరువులు చెర..

ఆక్రమణకు గురవుతున్న సర్కార్‌ భూములు

బోయినపల్లి(చొప్పదండి): కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా సాగుతోంది భూకబ్జాదారుల వ్యవహారం. చెరువులు.. కుంటల శిఖం భూమిని సైతం వదలడం లేదు. జలవనరులు, ప్రభుత్వ స్థలాలకు స్పష్టమైన హద్దులు లేకపోవడంతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణ లోపం, వివిధ శాఖల మధ్య సమన్వయలేమి ఆక్రమణదారులకు కలిసొస్తుంది. ప్రభుత్వ స్థలాలు, నీటివనరుల కబ్జాపై స్పెషల్‌ స్టోరీ.

హద్దులపై స్పష్టత కరువు

బోయినపల్లి మండలంలో సుమారు 53 చెరువులు, కుంటల పరిధిలో 2,588.86 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. అలాగే వివిధ గ్రామాల పరిధిలో మరో 78 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, జలవనరులకు ఎక్కడా సరైన హద్దులు లేకపోవడంతో చెరువు, కుంటల పరిసరాల్లో కొందరు రైతులు, అక్రమార్కులు యథేచ్ఛగా భూములను తమ పట్టాభూముల్లో కలిపేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమి కొలతలు(సర్వే) నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అధికారుల నిర్లక్ష్యంతో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఆగని ఆక్రమణల పర్వం

బోయినపల్లి మండలం దుండ్రపల్లిలో చెరువుశిఖం భూమి సుమారు 26 ఎకరాలు ఆక్రమణలకు గురైందని గ్రామానికి చెందిన మంద వెంకటేశ్‌గౌడ్‌ కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ను ఇటీవల కలిసి ఫిర్యాదు చేశాడు. ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని కోరాడు. ఇరిగేషన్‌ ఈఈకి సైతం వినతిపత్రం అందజేశాడు. తహసీల్దార్‌ ఎండీ.షరీఫ్‌ మొహియొద్దీన్‌, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి విచారణ నిర్వహించారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు.

బోయినపల్లి మండలం మల్కాపూర్‌లోని గోగులగుట్ట పరిసరాల్లో సుమారు 35 ఎకరాల పరంపోగు భూమి ఉండగా ఇందులో ఐదెకరాల మేర కబ్జాకు గురైందని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను గత జూన్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement