● 30 వరకు గడవు పొడగింపు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్, వ్యూస్ పోటీల గడువు తేదీని పొడగించినట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదివారం తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద ఉన్న ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడి చెరువులో ఉన్న వీటీఏడీఏ పార్క్, నాంపల్లిగుట్టకు సంబంధించిన ఉత్తమరీల్స్, ఎక్కువ వ్యూస్ వచ్చే వారు ఈ నెల 30 వరకు పంపించాలన్నారు. ఫారెస్ట్ అర్బన్ పార్క్, గుడి చెరువు బండ్ పార్క్, నాంపల్లి గుట్టలో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారిలో మొదటి బహుమతి రూ.15వేలు, రెండో బహుమతి రూ.10వేలు, మూడో బహుమతి రూ.5వేల చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తామని తెలిపారు. ఉత్తమ రీల్స్ రూపొందించి.. ఎక్కువ వ్యూస్ వచ్చిన రీల్స్‌ను 94402 39783కి లింక్ వాట్స్ ఆప్ చేయాలని కలెక్టర్ సూచించారు.


