సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సిరిసిల్ల: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కలెక్టరేట్‌లో శనివారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌లతో కలిసి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే సమక్షంలో సమీక్షించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసి సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభాస్థలిని పరిశీలించారు. చదును చేసే పనులను పర్యవేక్షించారు. సిరిసిల్ల జూనియర్ కాలేజీ మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి సీఎం పాదయాత్రగా సభాస్థలి వరకు అందరినీ కలుస్తూ వస్తారని మంత్రులు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శంకుస్థాపన చేస్తారని వివరించారు.
ఐదుగురు మంత్రులు.. ఇద్దరు విప్‌లు
జిల్లా కేంద్రంలో శనివారం ఐదుగురు మంత్రులు, ఇద్దరు ప్రభుత్వ విప్‌లు పర్యటించారు. సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, విజయరమణారావులు పాల్గొన్నారు. అంతకుముందు పోలీస్‌స్టేషన్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యే కటుకం మృత్యుంజయం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పార్టీ నాయకులు చక్రధర్‌రెడ్డి, స్వరూపారెడ్డి, ఆడెపు చంద్రకళ, గడ్డం నర్సయ్య, కూస రవీందర్, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, మిషన్ భగీరథ ఈఈలు అన్వర్, సుమలత, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, తహసీల్దార్ మహేశ్ పాల్గొన్నారు.


