● కలెక్టర్ గరీమా అగ్రవాల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఎస్‌ఐర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి అందజేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లోని 185 నుంచి 191 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం, తహసీల్దార్ మురళీకృష్ణ పాల్గొన్నారు.


