● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్లటౌన్: తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ రెండేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విమర్శించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఆదివారం సిరిసిల్ల పాతబస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని శుద్ధి చేశారు. గోపి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్రం వస్తే.. హైదరాబాద్ సంస్థానం మాత్రం ఆపరేషన్ పోలో తర్వాత 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్‌లో విలీనమైందని గుర్తు చేశారు. ఎర్రం మహేశ్, లింగంపల్లి శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బర్కం లక్ష్మి, శీలం రాజు, దుమాల శ్రీకాంత్, అంకిరెడ్డి, రాజాసింగ్, మ్యాన రాంప్రసాద్, కొండ నరేశ్, ఉరవకొండ రాజు, మెరుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
‘ముసురు’కున్న వాన
సిరిసిల్ల: జిల్లా అంతటా ఆదివారం ముసురు వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 32.1 మిల్లిమీటర్ల వర్షం పడగా.. రుద్రంగిలో 5.8, చందుర్తిలో 10.9, వేములవాడ రూరల్‌లో 12.6, బోయినపల్లిలో 18.3, వేములవాడలో 13.6, సిరిసిల్లలో 7.9, కోనరావుపేటలో 10.2, వీర్నపల్లిలో 10.5, ఎల్లారెడ్డిపేటలో 13.1, గంభీరావుపేటలో 2.9, ముస్తాబాద్‌లో 10.2, తంగళ్లపల్లిలో 16.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా సగటున 12.7 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది.
పోపా ప్రతిభా పురస్కారాలు ప్రదానం
సిరిసిల్ల అర్బన్ : చదువులో ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు పోపా బాధ్యులు మామిడాల భూపతి తెలిపారు. సిరిసిల్లలోని పద్మశాలి కల్యాణ భవన్‌లో ఆదివారం పోపా ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్, పాలీసెట్, ఎంసెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అత్యధిక మార్కులు సాధించిన వారికి నగదు పారితోషికంతోపాటు, మెమొంటో, సర్టిఫికెట్లను ఎంఈవో రఘుపతి చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. గాజుల ప్రతాప్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో గాలిపెల్లి కృష్ణహరి, సిరిపురం కృష్ణ, శ్రీనివాస్, గూడూరు ప్రవీణ్, గూడూరు రవీందర్, గడ్డం భగవత్, పోపా సభ్యులు ఆడెపు వేణు, చీరాల ప్రభాకర్, సత్యనారాయణ, అంకార జ్ఞానోబ పాల్గొన్నారు.
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మండలంలోని సైమా అకాడమీకి చెందిన ఐదుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. 8–10 ఏళ్ల వయస్సు విభాగంలో వైష్ణవి రజతం సాధించింది. వచ్చే నెలలో జైపూర్‌లో జరిగే జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపికై ంది. వైష్ణవిని డీవైఎస్‌వో అజ్మీరా రాందాస్, యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ నవీన్‌కుమార్, యోగా కోచ్ దేవయ్య, ఉషు సెక్రటరీ విక్రం, పీఈటీ భాను, గంభీరావుపేట మార్నింగ్ వాకర్స్ సభ్యులు అభినందించారు.
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా లహరి
వేములవాడ: జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా తోట లహరి నియమితులయ్యారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్‌ను ఆదివారం కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నపూర్ణ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.


