గణేశ్‌ మండపాలు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ మండపాలు

Sep 13 2026 11:51 PM | Updated on Sep 13 2026 11:51 PM

● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గణేశ్‌ మండప నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ● ప్రజారవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి. ● మండపాల నిర్వాహకులు సంబంధిత శాఖల అనుమతి, విద్యుత్‌శాఖ అనుమతిపత్రంతోనే కనెక్షన్‌ తీసుకోవాలి. ● ప్రతీ మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ● మండపాల బాధ్యత వహించే వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు మండపంలో ఏర్పాటు చేయాలి. ● మండపాల వద్ద 24 గంటలు నలుగురు వలంటీర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● ముందు జాగ్రత్తతో అగ్నిమాపక పరికరాలు, డ్రమ్ముల్లో నీరు, ఇసుకను ఏర్పాటు చేయాలి. ● భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయాలి. ● మండపాలు, శోభాయాత్రల్లో డీజేలను ఏర్పాటు చేయరాదు. ● విద్యాసంస్థలకు, ఆస్పత్రులకు, ప్రార్థన మందిరాలకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే చిన్న స్పీకర్లను పోలీస్‌ల అనుమతితో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. ● సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకే స్పీకర్లను వినియోగించాలి. ● మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం, అసభ్యకరమైన నృత్యాలు చేయడం, ఇతరులను కించపరిచేలా ప్రసంగాలు, పాటలు ఏర్పాటు చేయడం నిషేధం. ● ఇతరుల మనోభావాలు కించపరిచేలా మండపాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం నిషేధం. ● మండపాల్లో అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే డయల్‌ 112కు కాల్‌ చేయాలి. ● మండపాల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమలు నిర్వహిస్తే.. స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. ● మధ్యాహ్నం నుంచే గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించి నిర్ధేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి. ● శోభాయాత్ర సమయంలో ఇతరులను కించపరిచేలా స్లోగన్స్‌ చేయకూడదు. టపాసులు పేల్చడం నిషేధం. ● శోభాయాత్ర వాహన డ్రైవర్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం పేపర్స్‌ ఉండాలి. ● మద్యం సేవించి శోభాయాత్రలో పాల్గొనరాదు.

నిఘా నీడలో
● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ● శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే
సిరిసిల్ల: గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిఘా ఉంచాలని, రేయింబవళ్లు మండపాల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ మహేశ్‌ బీ గీతే సూచించారు. నవరాత్రి వేడుకలు, సోషల్‌ మీడియా పోస్టులపై పోలీస్‌ స్టేషన్ల వారీగా నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతించబోమని తెలిపారు. ఆదివారం పలు వివరాలు వెల్లడించారు. గణేశ్‌ మండపాల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్‌ బీ గీతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement