ముస్తాబాద్ డంపింగ్
యార్డులో చెత్తను కాల్చడంతో పొగ విపరీతంగా వస్తుంది. రత్నాలకుంట, మానేరు కెనాల్‌లోకి మురుగుచేరి దుర్వాసన వస్తోంది. దోమలు, ఈగలతో జ్వరాలు వస్తున్నాయి. డంపింగ్‌యార్డులో చెత్తను కాల్చకుండా నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకోవాలి.
– మాడూరి కిషన్, ముస్తాబాద్
డంపింగ్‌యార్డును శుద్ధి చేశాం
ముస్తాబాద్ డంపింగ్‌యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తను సగానికి పైగా తొలగించాం. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ ఖరీదైనది. ఎనిమిది నెలలుగా పారిశుధ్య చర్యలు తీసుకోవడంలో సిబ్బంది, మేము శ్రమిస్తున్నాం. మేజర్ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. – మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి,
సర్పంచ్, ముస్తాబాద్


