మట్టి గణపతిని పూజిద్దాం | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతిని పూజిద్దాం

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదామని ఎస్పీ మహేశ్‌ బీ గీతే కోరారు. గణేశ్‌ నవరాత్రుల సందర్భంగా పోలీ స్‌ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మట్టి వినాయడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారైన విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని కోరారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వా తావరణంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఎస్‌బీ సీఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

కుడికాలువకు నీటిని విడుదల చేయాలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గాలిపల్లి, తాళ్లపల్లి రై తులు శుక్రవారం గాలిపల్లిలో ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ కుడికాలువపై ఆధారపడి వందలాది ఎకరాల్లో వరిపంట వేశామని, నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్రచారి, మిడ్‌మానేరు డీఈ సూర్యప్రకాశ్‌, ఏఈ వంశీ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించా రు. రెండు, మూడు రోజుల్లో సమస్య పరి ష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతా మని హెచ్చరించారు. గాలిపల్లి సర్పంచ్‌ బద్దం శేఖర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్‌, రాజమల్లు, నరేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

వేములవాడరూరల్‌: నాణ్యమైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫైడ్‌ సూ చించారు. వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం సందర్శించా రు. మాత, శిశు ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల నివారణ చర్యలపై దృష్టి సారించారు. టీబీ ముక్త్‌ భారత్‌లో భాగంగా అవగాహన కల్పించాలని సూచించారు. డీపీవో రాజేందర్‌, సూపర్‌వైజర్‌ రాజయ్య, గంగమరాజు ఉన్నారు.

ఎరువులు అందుబాటులో ఉంచాలి

బోయినపల్లి(చొప్పదండి): రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని డీఏ వో అఫ్జల్‌బేగం అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి, ప్యాక్స్‌ నర్సింగాపూర్‌, బోయినపల్లి లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శుక్రవారం తనిఖీ చేశారు. విలాసాగర్‌లో డిజిటల్‌ క్రాప్‌ సర్వే నమోదు పరిశీలించారు. ఎంఏవో ప్రణీత, ఏఈవోలు రవళి, హరీష్‌ ఉన్నారు.

మద్యం మత్తులో వాహనాలు నడపొద్దు

వేములవాడ: మందు సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సిందేనని వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ హెచ్చరించారు. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలలో పట్టుబడ్డ 182 మందుబాబులను శుక్రవారం వేములవాడ కోర్టులో హాజరుపరి చారు. వీరికి మేజిస్ట్రేట్‌ మేఘన జరిమానాలు విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు చెప్పారు. 52 మందికి ఒక్కొక్కరికి రూ.4వేల చొప్పున, 26 మందికి ఒక్కొక్కరికి రూ.5వేలు, 45 మందికి ఒక్కొక్కరికి రూ.3వేలు, 59 మందికి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు. అంతకుముందు మద్యం సేవించి పట్టుబడిన వారికి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ట్రాఫిక్‌ ఆర్‌ఎస్సై దిలీప్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement