రోడ్డెక్కిన రైస్‌మిల్లర్లు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైస్‌మిల్లర్లు

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

● 14 డిమాండ్లతో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం

సిరిసిల్ల: జిల్లాలో రైస్‌మిల్లర్లు శుక్రవారం రోడ్డెక్కా రు. రైస్‌మిల్లులను బంద్‌చేసి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు పబ్బ నాగరాజు మాట్లాడుతూ ఎఫ్‌ఏక్యూ ధాన్యం మిల్లర్లకు ఇవ్వాలని, ఎఫ్‌సీఐ టెక్నికల్‌ స్టాప్‌ ద్వారా టెస్ట్‌ చేయాలన్నారు. సార్టెక్స్‌ రిజక్షన్స్‌ను మిల్లులకు అందించిన ధాన్యంలో తొలగించాలని, సీఎంఆర్‌లో 25 ఫెనాల్టీ, 12 శాతం వడ్డీని రద్దు చేయాలని కోరారు. మిల్లింగ్‌ చార్జీలను ఇతర రాష్ట్రాల తరహాలో రా రైస్‌కు క్వింటాలుకు రూ.100, బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు రూ.150 ఇవ్వాలని నాగరాజు కోరారు. రైస్‌ మిల్లులకు 125 హెచ్‌ పీ ఎల్‌టీ విద్యుత్‌ లైన్‌ సరిపోవడం లేదని 210 హెచ్‌పీ వరకు ఎల్‌టీ విద్యుత్‌గా పరిగణించాలని విన్నవించారు. గన్నీ రేట్లను రూ.50గా నిర్ధారించా లని, ఎఫ్‌సీఐ నిబంధనలు సరళతరం చేయాలన్నారు. ఖరీఫ్‌ ధాన్యాన్ని రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌గా తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైస్‌ మిల్లుల్లో షార్ట్‌ఫాల్‌ను 20 శాతం మేరకు పెంచాలని, ధాన్యం బకాయిలను ఎంఎస్‌పీ ప్రకారం చెల్లిస్తామని రైస్‌ మిల్లర్లు స్పష్టం చేశారు. ఈమేరకు 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌కు అందించారు. రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు ఎస్‌.రాజిరెడ్డి, సీ.హెచ్‌.శ్రీనివాస్‌, గరిపెల్లి ప్రభాకర్‌, పి.అనిల్‌రావు, వి.వంశీధర్‌రావు, పి.సత్యంరావు, బందం అంజయ్య, మల్లేశం, అనంతుల శ్రీనివాస్‌, నగునూరి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement