యూఎన్‌ఐడీవో ప్రతినిధి దేవజిత్ దాస్
సిరిసిల్ల: మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించాలని యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(యూఎన్‌ఐడీవో) ప్రతినిధి దేవజిత్‌దాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం యూఎన్‌ఐడీవో ఆధ్వర్యంలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ(ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ) ఆధ్వర్యంలో మహిళలకు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. దేవజిత్ దాస్ మాట్లాడుతూ మహిళల ఆధ్వర్యంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల అనుసంధానంతో బ్యాంకు రుణాలు పొందవచ్చని, సంక్షేమ పథకాలను, సామాజిక భద్రత సౌకర్యం లభిస్తుందన్నారు. సూక్ష్మ బీమాపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎల్‌డీఎం రాజీవ్‌కుమార్, వివిధ సంస్థల ప్రతినిధులు అరవింద్‌రావు, కె.సూర్యప్రకాశ్‌గౌడ్, శరత్ ముత్యాల, జిగ్నేశ్ డేవ్ తదితరులు పాల్గొన్నారు.


