చందుర్తి(వేములవాడ): విద్యుత్ కోతలను నిరసిస్తూ చందుర్తిలో బీజేపీ నాయకులు శుక్రవారం చందర్తి బస్టాండ్ ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను రోడ్డుపై నుంచి లాగేయడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్ శ్రీలతకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, పార్టీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్, పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, నాయకులు షిర్డీ మల్లేశం, పేరుక గంగరాజు, రాజశేఖర్, గంగస్వామి, చింతకుంట శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, బద్దం తిరుమల్‌రెడ్డి, పర్శరాములు, జలగం శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


