బీఆర్‌ఎస్‌ అసత్యాలు తిప్పికొడతాం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అసత్యాలు తిప్పికొడతాం

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర

సిరిసిల్లటౌన్‌: బీఆర్‌ఎస్‌ నేతల అసత్య ప్రచారాలు తిప్పికొడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. పోలీసులపై బీఆర్‌ఎస్‌ నాయకుల దౌర్జన్యం, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్‌పై అసభ్యంగా మాట్లాడడం వంటి ఘటనలను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దళితులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. కేటీఆర్‌ నిత్యం అబద్ధాలు ఆడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పట్టణాధ్యక్షుడు సూర దేవరాజు, ఫ్లోర్‌లీడర్‌ ఆడెపు చంద్రకళ, ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement