ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో గురువారం సమావేశమయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, తొమ్మిది రోజులపాటు హిందూ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలన్నారు. ఐక్యత, భక్తిభావం చాటేలా స్థానిక డప్పు కళాకారులతో శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు. డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిమజ్జనం సమయంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీఐ నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ ఫారూఖ్, ఎంపీడీవో లచ్చాలు, ఎస్సై జ్యోతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


