ఆలయ భూములపై సర్వే చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూములపై సర్వే చేయండి

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

దేవాదాయశాఖ కమిషనర్‌ సుప్రియకు వినతి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆలయాల భూములపై సర్వే చేయాలని బీజేపీ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు చందుపట్ల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కిరణ్‌నాయక్‌ కోరారు. ఈమేరకు బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్‌ సుప్రియకు భూముల వివరాలు తెలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కేశవ పెరుమాండ్ల ఆలయం, రావిచెట్టు హనుమాన్‌ ఆలయం, శ్రీరుక్మిణి సమేత వేణుగోపాలస్వామి ఆలయ భూముల వివరాల కోసం వెంటనే సర్వే చేయాలన్నారు. గ్రామంలోని ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. కమిషనర్‌ స్పందిస్తూ ఆలయ భూముల వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు. నాయకులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement