● గాలిపల్లిలో సొసైటీ గోదాముకు తాళం ● ధర్మారంలో రాస్తారోకో
ఇల్లంతకుంట/కోనరావుపేట: యూరియా లభించడం లేదని మండలంలోని గాలిపల్లి ప్యాక్స్ ఎరువుల గోదాముకు రైతులు బుధవారం తాళం వేశా రు. యూరియా యాప్ జిల్లా యూనిట్‌గా ఉండడంతో స్థానిక రైతులకు ఎరువులు దొరకడం లేదన్నా రు. మండల యూనిట్‌గా చేయాలని కోరారు. ప్యాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, ఏఈవో రవళి, సొసైటీ కార్యదర్శి మల్లేశం చేరుకొని రైతులకు నచ్చజెప్పా రు. జిల్లా కోపరేటీవ్ అధికారి రామకృష్ణ రైతులతో ఫోన్లో మాట్లాడడంతో రైతులు తాళం తీశారు.
ధర్మారంలో రాస్తారోకో
కోనరావుపేట మండలం ధర్మారంలో సర్పంచ్, బీజేపీ మండలాధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో ఇంకా 22 ఎకరాల భూమి సేకరించి కాలువలు నిర్మించాలన్నారు. గంగుల ప్రశాంత్, పొన్నం పరశురాములు, గంగుల రమేశ్, మల్యాల సుమన్, మైలారం రమేశ్, అన్నబోయిన అభిషేక్, పొట్లపల్లి గోపి, తిరుపతి, బక్కయ్య, రాకేశ్, ఎల్లయ్య , విక్రం, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


