● ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్
సిరిసిల్లటౌన్: విద్యుత్ సరఫరాలో తలెత్తే లోపాలు అధిగమిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సిరిసిల్లలోని విద్యుత్ స్టోర్‌లో బుధవారం ఆపరేషన్ సమీక్ష జరిపి మాట్లాడారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులతో మాట్లాడారు. పెద్దూరులోని 220 కేవీ సబ్‌స్టేషన్, 132 కేవీ ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్, జిల్లా స్టోర్స్‌ను తనిఖీ చేశారు. చీఫ్ ఇంజినీర్ బి.అశోక్, డివిజనల్ ఇంజినీర్ ఎన్.అంజయ్య పాల్గొన్నారు.


