ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆశాకార్యకర్తల ముందస్తు అరెస్ట్‌

Sep 8 2026 11:47 PM | Updated on Sep 8 2026 11:47 PM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ హామీలపై బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసనలతో హోరెత్తిస్తుంటే, ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో నిరసన చేపట్టే అన్ని వర్గాలపై నిర్బంధం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్లి నిరసన తెలుపుతారనే ఉద్దేశంతో ఆశాకార్యకర్తలను పోలీసులు, ముందస్తు అరెస్టు చేశారు. మంగళవారం ఉద యం నుంచి రాత్రి 8 గంటలకు సొంత పూచీకత్తుపై ఎవరి ఊర్లకు వారిని పంపించారు. ఆశాకార్యకర్తలు శోభ, జ్యోత్స్న, దేవలక్ష్మి, దేవేంద్ర, సంతోష, కె.రజిత, ఎం.దేవేంద్ర, రజిత, మనూష, వాణి ఉన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

సిరిసిల్ల: జిల్లాలో వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ కోరారు. కలెక్టరేట్‌ నుంచి మంగళవారం ఆర్డీ వోలు, తహసీల్దార్లు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. సర్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement