● ‘ఇది సిరిసిల్లలోని బీవై నగర్ కార్మిక క్షేత్రం. నాలుగున్నర దశాబ్దాల కిందట ఇక్కడ రాయిని చెరువు ఉండేది. నేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో నివాస స్థలాల లేక అప్పటి పాలకులు చెరువు శిఖంలో ఇళ్ల స్థలాలను పట్టాలుగా ఇవ్వడంతో బీవైనగర్, సుందరయ్యనగర్, తారక రామానగర్, ఇందిరానగర్‌లాంటి ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఈ నాలుగు కార్మికవాడల్లో 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. ఏదైనా ఆపద పడి ఇల్లును అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే.. రిజిస్ట్రేషన్ కావడం లేదు. కార్మిక వాడల్లో ఆస్తులున్నా అక్కరకు రావడం లేదు. ప్రభుత్వ రికార్డుల్లో 22–ఎ జాబితాలో చేరిపోయింది. ఫలితంగా సామాన్యులు బాండ్ పేపర్లపై ఇంటి నంబరుతో క్రయ, విక్రయాలు సాగిస్తున్నారు.’


