వేములవాడ మండలం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6లో నాకు ఐదున్నర గుంటల భూమి ఉంది. అగ్రహారం ఆలయానికి అరకిలోమీటరు దూరంలో నా భూమి ఉంటుంది. కానీ, ఆ సర్వే నంబరులోని భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేర్చారు. అన్ని ఆధారాలు చూపినా పని కావడం లేదు. నాలాంటి వాళ్లు అవసరాలకు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బంది అవుతుంది.
– అన్నారం రాజు, సిరిసిల్ల
కలెక్టరేట్ నుంచి క్లారిటీ వస్తేనే..
వేములవాడ మండలం అగ్రహారం తెట్టెకుంట శివారులోని సర్వే నంబరు 6 మా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో ప్రొహిబీటెట్‌గా నమోదైంది. ఆ సర్వే నంబరులోని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వస్తేనే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మేం ఏమీ చేయలేం. ఆ స్థలాల యజమానులు రెవెన్యూ అధికారులను సంప్రదించాలి.
– విజయభాస్కర్, సబ్ రిజిస్ట్రార్, వేములవాడ
సర్వేలతో సరిచేస్తున్నాం
జిల్లాలో 22– జాబితాలో వ్యవసాయ భూములు ఏమీ లేవు. కొన్ని వ్యవసాయేతర భూములు నమోదయ్యాయి. వాటిని క్షేత్రస్థాయి సర్వేలతో సరి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 22–ఎ సమస్యలతో కేవలం 11 ఫిర్యాదులు మాత్రమే అందాయి. వాటిని నిబంధనల మేరకు పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– గడ్డం నగేశ్, అదనపు కలెక్టర్


