● కలెక్టర్ గరీమా అగ్రవాల్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆయిల్‌పాం సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం సమకూరుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఆదర్శరైతు డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు ఏడెకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌ఫాంను మంగళవారం పరిశీలించారు. ఆయిల్‌పాం సాగుతో 15 టన్నుల ఆయిల్ గెలలు తీసి, రూ.3.45లక్షల ఆదాయం పొందారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయిల్‌పాం సాగుతో చీడ, కొతుల బాధలు ఉండవన్నారు. మార్కెటింగ్ సులభంగా వుంటుందని, నర్మెట్టకు సులభంగా ఆయిల్ గెలలను తరలించవచ్చన్నారు. నామాపూర్, బోయినపల్లి, నేరెళ్ల, సిరిసిల్లలో ఆయిల్ గెలల కలెక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు. అనంతరం గూడెంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎంపీల్యాడ్స్‌తో వేసిన బోరు మోటారును ప్రారంభించారు.
ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలు
ఈసీ ఆదేశాల మేరకు ప్రతీ గ్రామంలో హియరింగ్ సమావేశాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం చీకొడులో నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ సమావేశాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్‌వోలు, తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో సర్ ప్రక్రియను పరిశీలించాలన్నారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, డీఈఈ సాజిద్, సర్పంచ్‌లు శంకర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


