సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల ఎదుట ఉన్న బస్‌స్టాప్‌లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఏపుగా గడ్డి పెరిగి బస్‌స్టాప్‌లోకి వెళ్లలేకుండా మారింది. సిరిసిల్లకు వెళ్లే ప్రయాణికులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్టాప్‌లోనే వేచి ఉంటారు. అయితే బస్‌షెల్టర్ ఎదుట ఇలా గడ్డి పెరిగి, బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటిని తొలగించి, గడ్డిని తీసేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల


