కోనరావుపేట(వేములవాడ): యాప్‌ను తొలగించి.. పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు శనివారం బైఠాయించారు. వారు మాట్లాడుతూ యాప్‌లో బుకింగ్, సర్వర్ సమస్యలతో కొద్ది రోజు లుగా ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. చేతికొచ్చిన పంటకు యూరియా వేసే కీలక తరుణంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. డిజిటల్ ప్రక్రియ పేరుతో క్షేత్రస్థాయిలో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ లంబ రాజు, కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు ముత్యాల శ్రీని వాస్‌రెడ్డి, నాయకులు పర్శరాములు, భాస్కర్‌రెడ్డి, తాళ్లపెల్లి మధు, శ్రీకాంత్, మహేశ్, లంబ వేణు పాల్గొన్నారు.
రైతుల ఆందోళన
కోనరావుపేట మండలం సుద్దాలలోని సింగిల్‌విండో గోదాం వద్ద రైతులు ఆందోళన చేశారు. యూరియా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేద్దామంటే 5 నిమి షాల్లో ఖాళీ కావడంపై వ్యవసాయాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి వ్యవసాయాధికారి దుర్గరాజు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు.


