ఇసుక రీచ్‌లపై నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌లపై నిబంధనలు పాటించాలి : కలెక్టర్‌

Sep 6 2026 2:07 AM | Updated on Sep 6 2026 2:07 AM

సిరిసిల్ల: జిల్లాలో కొత్త ఇసుక రీచ్‌లపై ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. టీజీఎండీసీ పీవో శ్రీని వాస్‌, మైనింగ్‌ ఏడీ క్రాంతికుమార్‌, నీటి పారుదల శాఖ అధికారులు ప్రశాంత్‌, కిశోర్‌కుమార్‌, మున్సి పల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా, తహసీల్దార్లు మహేశ్‌, మురళి, పర్యవేక్షకులు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఎరువుల కొరత లేదు

చందుర్తి(వేములవాడ): ఎరువులకు కొరత లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చందుర్తి పీఏసీఎస్‌లోని ఎరువుల నిల్వలు తనిఖీ చేశారు. యూరియా కోసం పీఏసీఎస్‌కు వచ్చిన రైతులతో మాట్లాడారు. వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఏడీఏ ప్రదీప్‌ ఉన్నారు.

15న రాజన్న కోడెలు పంపిణీ

వేములవాడఅర్బన్‌: రాజన్న కోడెలను ఈనెల 15న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రైతులకు 150 జతలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులు ఈనెల 10 వరకు https//rajannasiricilla. telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement