న్యూస్‌రీల్
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కృష్ణం వందే జగద్గురుమ్
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు.
కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్‌ఎల్‌ఎన్‌లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్‌షీడ్ తయారు చేశాడు.
గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ..
మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!


