సిరిసిల్లటౌన్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను గంగాజలంతో శుద్ధిచేసిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే వారికి సరైన రీతిలో బుద్ధిచెబుతారన్నారు. పట్టణ, మండల అధ్యక్షులు సూర దేవరాజు, సుడుది రాజేందర్, జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, గంగరాజు, వెంగళ లీలా లక్ష్మీనరసయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య, గడ్డం నరసయ్య, రాగుల జగన్, వంగ గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


