సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం జిల్లా స్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఎనమిది మండలాల నుంచి కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాల విద్యార్థులు పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. డీవైఎస్‌వో రాందాసు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఉప్పల శ్రీనివాస్, ఆడెపు రవీందర్, కల్లూరి రాజు, వెల్దండి శంకర్, గాజుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.


