జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్ల: రాజీయే రాజమార్గమని, కోర్టు కేసుల్లో ఇరుపక్షాలు రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు సముదాయంలో గురువారం సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారమవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని తెలిపారు. ఎన్‌ఐ యాక్ట్ (చెక్ బౌన్స్) కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి, సిరిసిల్ల డీఎల్‌ఎస్‌ఏ ఇన్‌చార్జి కార్యదర్శి పి.లక్ష్మణాచారి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకయ్య పాల్గొన్నారు.


