వేములవాడఅర్బన్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. వేములవాడ మండలం చీర్లవంచ పీహెచ్‌సీని గురువారం సందర్శించారు. పీహెచ్‌సీలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్‌సీడీ స్క్రీనింగ్ జరిగేలా చూడాలన్నారు. డెంగీ, మలేరియా, వైరల్‌ఫీవర్స్ తదితర వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి, ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేందర్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.


