ఎల్లారెడ్డిపేట: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. మండలానికి చెందిన ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఓసీడీ ప్రొసీడింగ్ పత్రాలను గురువారం అందజేశారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను ఎంపీడీవో సత్తయ్య అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుడిది రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాట నరసయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


