సోనియాగాంధీని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదు | - | Sakshi
Sakshi News home page

సోనియాగాంధీని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదు

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

సిరిసిల్ల అర్బన్‌ : కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే హక్కు కేటీఆర్‌కు లేదని రాష్ట్ర ఎస్సీసెల్‌ జనరల్‌ సెక్రెటరీ ఆకునూరి బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చిందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని ఇస్తానని హామీలిచ్చి ఎందుకు అమలు చేయలేదన్నారు. బీసీ నాయకుల పట్ల కొండూరి రవీందర్‌రావు మాట్లాడిన తీరును ఖండిస్తున్నామన్నారు. వెయ్యిరోజుల పాలన అని బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతున్నారని, మరి కేసీఆర్‌ వెయ్యి రోజుల్లో ఒక్కసారైనా ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు రాగుల జగన్‌, కంసాల మల్లేశం, బైరగోని రమేశ్‌, కొమ్ము త్యాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement