క్రీడలతో మానసికోల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసికోల్లాసం

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

ముస్తాబాద్‌: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఎంఈవో రవీందర్‌ అన్నారు. మండలంలోని నామాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడల ముగింపు గురువారం జరిగాయి. బాలబాలికలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు డీసీసీ ప్రధాన కార్యదర్శి యెల్ల బాల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలకు మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన విద్యార్థులను జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ పోటీలకు ఎంపిక చేశారు. సర్పంచ్‌ అనిల్‌, ఆత్మ డివిజన్‌ కమిటీ చైర్మన్‌ కొండం రాజిరెడ్డి, ఉపసర్పంచ్‌ కొమురయ్య, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ వెల్ముల రాంరెడ్డి, హెచ్‌ఎం హన్మంత్‌రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement